వరుస ఫ్లాప్‌లతో అసలే కష్టాల్లో ఉన్న హీరో గోపిచంద్‌కు మరో షాక్ తగిలింది. కొత్త దర్శకుడితో హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావించిన నిర్మాత భోగవల్లి ప్రసాద్ ఆ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తొలి సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో విలన్‌గా టర్న్ అయ్యాడు. జయం, వర్షం, నిజం సినిమాల్లో విలన్‌గా నటించిన గోపిచంద్‌కు మంచి పేరు వచ్చింది. అయితే హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న కసితో యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు గోపిచంద్. ఆ తరువాత కెరీర్‌లో రణం, లక్ష్యం, లౌక్యం లాంటి ఒకటి రెండు హిట్స్ వచ్చినా స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయి హిట్స్ మాత్రం పడలేదు. దీంతో ఇప్పటికీ మార్కెట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు గోపిచంద్. Also Read: తాజాగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రంతో పోటి పడటం కూడా చాణక్యకు నష్టామైంది. భారీ యాక్షన్ సీన్స్, , జరీన్ ఖాన్‌ల అందాలు ఏవీ సినిమాను కాపాడలేకపోయాయి. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ వసూళ్లు సాధించటంలోనూ ఫెయిల్ అయ్యింది. Also Read: దీంతో చాణక్య.. గోపిచంద్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రభావం గోపిచంద్ తదుపరి చిత్రాలపైనా కనిపిస్తోంది. చాణక్య తరువాత గ్యాప్ తీసుకున్న గోపిచంద్ నెక్ట్స్ సినిమాను ప్రారంభించాల్సి ఉంది. చాణక్య షూటింగ్ సమయంలోనే భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఓ సినిమాను ప్రకటించాడు గోపి. మాస్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రకటించాడు. అయితే ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ మార్కెట్ ఏమాత్రం బాగోలేకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. గోపిచంద్ మలినేనితో చేయాలనుకున్న సినిమా కూడా భారీ బడ్జెట్ చిత్రం కావటంతో ఆ ప్రాజెక్ట్‌పై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో గోపిచంద్ ఏ ప్రాజెక్ట్‌ను మొదలు పెడతాడో చూడాలి. Also Read:
https://ift.tt/2o0CTeT
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2oUpN39

0 Comments