టాలీవుడ్ యంగ్ హీరో రానాపై రూమర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే రానా ఆరోగ్య పరిస్థితిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రానా త్వరలో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాగా బక్కచిక్కిపోయిన భల్లాలదేవుడు కండలు పెంచే పనిలో ఉన్నాడు. ముందుగా సెట్స్ మీద ఉన్న బైలింగ్యువల్ మూవీ హథీ మేరి సాథీ సినిమాను పూర్తి చేయనున్నాడు రానా. ఆ సినిమాతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కబోయే విరాటపర్వం సినిమా పనులు కూడా ప్రారంభించనున్నాడు. అయితే ఈ రెండు సినిమా తరువాత ఓ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశాడు రానా. Also Read: తన సొంత బ్యానర్‌లో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో పౌరాణిక గాథ హిరణ్యకశ్యపను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు. టైటిల్ రోల్ లో రానా నటించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు దేవ విదేశాల్లోని దాదాపు 17 విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలతో గ్రాఫిక్స్ కోసం ఒప్పందాలు చేసుకున్నారు. Also Read: అయితే ఇప్పుడు రానా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. అయితే ఆరోగ్య పరిస్థితి కారణంగానే రానా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు గుణశేఖర్‌కు మరో నటుడిని తీసుకోమని సూచించారట. మరి గుణశేఖర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ సినిమాతో పాటు మలయాళ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు మార్తండవర్మ కథతో తెరకెక్కనున్న సినిమాకు కూడా రానా ఓకె చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి ఈ సినిమా విషయంలో రానా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం బాహుబలి ప్రదర్శన కోసం లండన్ వెళ్లిన రానా, త్వరలో తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిన తరువాత సినిమాలకు సంబంధించి పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. Also Read:
https://ift.tt/2VX4lGG
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2P6dCuL

0 Comments