ధనుష్ హీరోగా వెట్రీమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అసురన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు.. ధనుష్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి వారమే వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ఇతర భాషల నుంచి రీమేక్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆసక్తిగా ఉన్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రామ్‌చరణ్‌కు సీనియర్ హీరో షాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోకముందే మీద కర్చీఫ్ వేసేశాడు. అంతేకాదు ఈ సినిమాను తమిళ నిర్మాత కలైపులి ఎస్ థానుతో కలిసి తమ సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఇప్పటికే రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. Also Read: ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినా దర్శకుడెవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. Also Read: తమిళ వర్షన్‌తో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. 50 ఏళ్ల వ్యక్తిగా, 20 ఏళ్ల కుర్రాడి రెండు వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించాడు. వెంకటేష్ రెండు పాత్రలు చేయటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. 50 ఏళ్ల వ్యక్తి పాత్రకు వెంకీ న్యాయం చేసిన 20 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఆ పాత్రకు మరో నటుడిని తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా ప్రారంభమయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
https://ift.tt/2Ndyyxh
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/367rGdD

0 Comments