rvnht

ఆ చైల్డ్‌ ఆర్టిస్ట్‌తో బెల్లంకొండ బాబు రొమాన్స్‌!

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్‌. ఇప్పుడు ఈ యంగ్ హీరో తమ్ముడు గణేష్‌ బాబు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణేష్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవల లాంచనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బెల్లంకొండ బాబుకు జోడిగా నటించబోయే భామను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. Also Read: ఇటీవల నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో తెరకెక్కిన మజిలీ సినిమాలో నాగచైతన్య కూతురిగా నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అనన్య అగర్వాల్‌ గణేష్‌ బాబు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. మజిలీ సినిమాలో నాగచైతన్య పెంపుడు కూతురిగా క్రికెటర్‌గా కనిపించింది అనన్య. బాలీవుడ్ సీరియల్స్‌తో పాపులర్‌ అయిన ఈ భామ వయసు 15 ఏళ్లే. ఇంత చిన్న పాప హీరోయిన్‌గా సెట్‌ అవుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే టీనేజ్‌ లవ్‌ స్టోరి కావటంతో అనన్యనే కరెక్ట్ చాయిస్‌ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. Also Read: అనన్య అగర్వాల్‌తో పాటు మరో నలుగురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే అనన్య, దక్ష, నటాషాలను హీరోయిన్లుగా తీసుకున్న చిత్రయూనిట్ మరో ఇద్దరు భామలు ఫైనల్‌ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేమ ఇష్క్‌ కాదల్, సావిత్రి చిత్రాల దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. బీటెల్‌ లీఫ్ ప్రొడక్షన్స్‌, లక్కీ మీడియాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే ,సంభాషణలు అందిస్తుండటం విశేషం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. Also Read:

https://ift.tt/2J2GFf1
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/31Dseog

Post a Comment

0 Comments