rvnht

అఖిల్‌ మళ్లీ అదేనా.. ఇంక మారవా..?

అక్కినేని నట వారసుడిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అఖిల్‌. భారీ బడ్జెట్‌తో వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు అఖిల్‌. డెబ్యూ సినిమాలోనే ప్రపంచాన్ని కాపాడే సూపర్‌ హీరోగా కనిపించిన అఖిల్‌ ఆ స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాడు. దీంతో తొలి ప్రయత్నంతో అఖిల్‌ అక్కినేని అభిమానులకు నిరాశనే మిగిల్చాడు. రెండో సినిమాగా చేసిన హలో పరవాలేదనిపించినా అఖిల్ మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేపోయింది. దీంతో రూట్‌ మార్చి తండ్రి బాటలో మన్మథుడు ఇమేజ్‌ను ట్రై చేశాడు అఖిల్. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి మిస్టర్‌ మజ్ను కూడా అఖిల్ కోరిక తీర్చలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్‌ కావటంతో అకిల్ ఆలోచనలో పడ్డాడు. Also Read: ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన నాలుగు సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌ను గాడిలో పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. Also Read: అయితే తాజాగా అఖిల్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అక్కినేని హీరో తన తదుపరి చిత్రాన్ని ఓ తమిళ దర్శకుడితో చేసేందుకు ఓకె చెప్పాడట. కోలీవుడ్‌లో విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిత్రన్ దర్శకత్వంలో అఖిల్‌ 5 తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ మరోసారి ప్రపంచాన్ని కాపాడే వ్యక్తిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం తమిళ్‌లో శివకార్తికేయన్ హీరోగా మిత్రన్ తెరకెక్కిస్తున్న హీరో సినిమానే అఖిల్ హీరోగా రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల అఖిల్ పలు సందర్భాల్లో శివకార్తీకేయన్‌ను కలవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. Also Read: తొలి సినిమాలోనే తన వయసుకు ఇమేజ్‌కు సరిపడని కథతో నిరశపరిచిన అఖిల్‌, మరోసారి అదే ప్రయోగం చేస్తుండటంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. లవర్‌ బాయ్‌ స్టోరీస్‌ చేయాల్సి ఏజ్‌లో మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించి అఖిల్‌ తప్పు చేస్తున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

https://ift.tt/32znctW
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2VYEY7A

Post a Comment

0 Comments