rvnht

సైరా కలెక్షన్స్: రికార్డ్స్ బ్రేక్.. మెగాస్టార్ ఆన్ ఫైర్

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమా సెకండ్ డే కూడా అదే రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టింది. కేవలం తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే మాత్రం మొదటి రోజు 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సైరా రెండో రోజు కూడా పాతిక కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు 10 కోట్లకు పైగానే డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా సైరా వసూళ్ళ లెక్క గట్టిగానే ఉంది. Also Read: రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సైరా వసూళ్లు 20 కోట్లు టచ్ అయ్యాయి. అంటే గ్రాస్ సుమారు 8 కోట్ల వరకు ఉంటుంది. దీంతో మెగాస్టార్ సినిమా మూడు రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇంకా దూసుకుపోతుంది. అయితే శనివారం, ఆదివారం కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ రెండు రోజుల్లో కలెక్షన్స్ పుంజుకుంటే మెగాస్టార్ సైరా వీకెండ్‌కి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ని టచ్ చేస్తుంది. ఆ తరువాత ఎటూ దసరా హాలిడేస్ ఉన్నాయి, పండగ హడావిడి కూడా కలుపుకుని వచ్చేవారాంతానికి రెండు వందల కోట్ల మార్క్ అందుకుంటుంది. ఒక్క బాహుబలి 2 తప్ప వేరే ఏ సినిమా సాధించిన రికార్డ్ కూడా సైరా ముందు నిలిచే అవకాశం కనిపించడం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు అందుకోవడం ఖాయం. Also Read: ఇక సైరా సిట్యుయేషన్ తెలుగు వరకు బాగానే ఉన్నా బాలీవుడ్‌లో మాత్రం ఎందుకో సరిగా పికప్ కావట్లేదు. సైరా అక్కడ టాక్ బాగా వచ్చింది. సినిమాలో అమితాబ్ లాంటి స్టార్ ఉన్నాడు. కానీ ఈ సినిమా మాత్రం అక్కడ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. మొదటి రోజుతో పోలిస్తే సెకండ్ డ్రాప్ ఎక్కువగా ఉంది. కానీ మూడో రోజు మాత్రం ఈ సినిమా అక్కడ రెండు కోట్లకంటే తక్కువ వసూళ్ళు సాధించింది. దీంతో వీకెండ్ కలెక్షన్స్‌ని బట్టి బాలీవుడ్‌లో సైరా ఫేట్ ఏంటి అనేది తేలుతుంది. అలాగే ఓవర్సీస్‌లో సైతం సైరా అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది అనేది ట్రేడ్ టాక్. అయితే అక్కడ కూడా వీకెండ్ కలెక్షన్స్ అనేవి చాలా కీలకం. టాక్ బావుంది కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్ డేకి సమానంగా కలెక్షన్స్ రావచ్చు. సైరా మూడో రోజు కూడా టాక్‌ని నిలబెట్టుకుంది కాబట్టి వీకెండ్ అడ్వాంటేజ్‌ని కూడా వాడుకుంటూ డిస్ట్రిబ్యూటర్స్‌ని గట్టెక్కించేస్తుంది. తెలుగు రాష్టాల్లో మాత్రం మరో పది రోజులపాటు సైరా హవాకి తిరుగుండదు. Also Read:

https://ift.tt/2VfuHDv
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2MfhxlX

Post a Comment

0 Comments