rvnht

అసురన్‌ అద్భుతమన్న సూపర్‌ స్టార్‌

కోలీవుడ్ స్టార్‌ హీరో హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం . ఇటీవల విడుదలైన ఈ సినిమాకు యునానిమస్‌గా పాజిటివ్ టాక్‌రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటన అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు విశ్లేషకులు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్‌ స్టార్ కూడా స్పందించాడు. ఆదివారం అసురన్‌ సినిమా చూసిన మహేష్ చిత్రయూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. `అసురన్‌.. రా, రియల్‌ అండ్‌ ఇంటెన్స్‌. అన్ని రకాలుగా సినిమా బెస్ట్. హీరో ధనుష్‌, దర్శకుడు వెట్రిమారన్‌, ప్రకాష్ రాజ్‌, జీవీ ప్రకాష్‌కుమార్‌లకు శుభాకాంక్షలు` అంటూ ట్వీట్ చేశాడు మహేష్. అసురన్‌ను మహేష్‌ అభినందించటంపై తమిళ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ధనుష్‌ ఈ సినిమాలో 20 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా, యువకుడిగా రెండు పాత్రల్లో నటించాడు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న ధనుష్‌ ఈ సినిమాతో మరోసారి తన మార్క్‌ చూపించాడు. ధనుష్‌ భార్యగా మలయాళ సీనియర్‌ నటి మంజువారియర్‌ నటిచింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావాటం విశేషం. అసురన్‌ మ్యూజిక్‌కు కూడా సూపర్బ్ రెస్పాన్స్‌ వచ్చింది. రథన్‌ అందించిన పాటలు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగుతూ ఆడియన్స్‌ను ఆకాలంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ధనుష్‌కు నేషనల్‌ అవార్డు గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్‌. మరి అభిమానులు ఆశించినట్టుగా ధనుష్‌ సక్సె్స్‌తో పాటు అవార్డులు కూడా సాధిస్తాడేమో చూడాలి. Also Read:

https://ift.tt/2N0rWlQ
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2pAB5to

Post a Comment

0 Comments