rvnht

పవన్‌ రీఎంట్రీ కన్‌ఫర్మ్‌.. కానీ ఏ సినిమాతో?

పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా పవన్‌ తిరిగి సినిమా చేయటం దాదాపుగా కన్‌ఫర్మ్‌ అయ్యింది. ఇప్పటికే పవన్‌ పింక్‌ రీమేక్‌లో నటించనున్నాడన్న వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్‌ రాజు. బోని కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా తెర మీదకు వచ్చింది. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఖుషీ సినిమా నిర్మాత ఏఎం రత్నం బ్యానర్‌లో పవన్‌ సినిమా చేయనున్నాడన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ లోగా పవన్‌ రాజకీయాల్లోకి రావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు అదే సినిమా చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. Also Read: అంతేకాదు పవన్‌ ఏఎం రత్నం కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే పవన్‌ కోసం సామాజిక సమస్యల నేపథ్యంలో క్రిష్ ఓ కథను సిద్ధం చేశాడట. పవన్‌ కూడా ఆ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ లోగా పింక్‌ రీమేక్‌ కూడా తెర మీదకు రావటంతో పవన్‌ ఏ సినిమా చేస్తాడన్న చర్చ మొదలైంది. Also Read: పవన్‌ చివరగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. ఈ సినిమా డిజాస్టర్‌ కావటంతో అభిమానులు నిరాశచెందారు. ఒకవేళ పవన్‌ సినిమాకలు గుడ్‌ బై చెపితే ఓ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చేసిన తరువాత సినిమాల నుంచి రిటైర్‌ అవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు పవన్‌ రీ ఎంట్రీ కన్‌ఫర్మ్‌ కావటంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. Also Read:

https://ift.tt/36m1xb0
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2C5pFRh

Post a Comment

0 Comments