ఈ జనరేషన్ హీరోలు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోలు అనిపించేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే తెర మీద హీరోయిజం చూపించే స్టార్స్ తెర వెనుక తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుక తమ వంతుగా స్పందిస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి కోసం ఓ కమెడియన్ రిక్వెస్ట్‌తో ఇద్దరు యంగ్ హీరోలు స్పందించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న కమెడియన్ శుక్రవారం తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ పోస్ట్ చేశాడు. `శ్రీజ సర్జరీ సక్సెస్ అయ్యింది. తన కుటుంబంలో ఆనందం వెళ్లివిరిసింది. శ్రీజను కాపాడేందుకు 4 లక్షలు, 50 వేలు సాయం చేసిన.. నా సోదరులు , కార్తికేయలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. డబ్బు సాయం చేసిన అందరికీ రుణపడి ఉంటాను. మీరంతా దేవుళ్లు` అంటూ ట్వీట్ చేశాడు ప్రియదర్శి. Also Read: ఆ పాప ఎవరు తనకి ఉన్న సమస్య ఏంటి అన్న విషయం వెల్లడించకపోయినా నాని, కార్తికేయల సహకారంతో తనక సాయం చేసిన విషయాన్ని ప్రకటించాడు ప్రియదర్శి. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోలుగా స్పందించిన నాని, కార్తికేయలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రియదర్శి పోస్ట్ పై స్పందించిన `చిన్నారి గురించి ఈ విషయం తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది అన్న. నువ్వు చేస్తున్న పని ముందు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ చిన్నారి త్వరలో కలవాలని కోరుకుంటున్నా` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: నాని, కార్తికేయ, ప్రియదర్శిలు గ్యాంగ్ లీడర్ సినిమాలో కలిసి నటించారు. నాని హీరోగా కనిపించగా కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి అలరించాడు. ప్రస్తుతం నాని, వి సినిమాలో నటిస్తుండగా.. కార్తికేయ 90 ఎంఎల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
https://ift.tt/33PFo3m
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2rPeomq

0 Comments