హాలీవుడ్ యాక్షన్ స్టార్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించటం కన్నా గొప్ప ఫీలింగ్ ఏది ఉండదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నా బ్రూజ్ మూవీ కోసం నేను సెట్ చేసుకున్ గోల్ సిక్స్ ప్యాక్ యాబ్స్ సాధించటం. ఈ రోజు నా గోల్ రీచ్ అయ్యాను. ఈ విషయం నేనే నమ్మలేకపోతున్నా` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు 53 ఏళ్ల హాలీ బెర్రీ. హాలీ సిక్స్ ప్యాక్ సాధించటంపై స్పందించిన ఆమె పర్సనల్ ట్రైనర్ ముబారక్ మాలిక్ ఇది ఎచీవ్‌మెంట్ అంత సులభంగా సాధ్యం కాలేదన్నారు. హాలీ రోజుకు నాలుగు గంటల చొప్పున జిమ్ చేసేదని తెలిపాడు. అంతేకాదు ఆహారం విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అప్పుడప్పుడు ఉపవాసం ఉంటూ కీటో డైట్‌ను ఫాలో అవ్వటం వల్లే సిక్స్ ప్యాక్ సాదించికగలిగిందని తెలిపారు. Also Read: తన సిక్స్ ప్యాక్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేసిన హాలీ బెరీ అందరూ తనలా గోల్స్ సెట్ చేసుకొని వాటిని సాధించాలని సూచించారు. `మీ ఫిట్‌నెస్ గోల్ ఏంటి..? మీరు అనుకున్న దానికన్నా ఉన్నతమైన గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్‌ను కామెంట్స్ ద్వారా తెలిపి వాటిని సాధించేందుకు కష్టపడండి. అది సాధించటం కష్టం కాదు. కానీ మీ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది. Also Read: బాండ్ గర్ల్‌గా ఫేమస్ అయి హాలీ బెర్రీ అకాడమీ అవార్డును సైతం సాధించింది. సినిమాలతో పాటు టెలివిజన్ షోస్‌లో కూడా కనిపించింది. నటిగానే కాక నిర్మాతగాను పలు చిత్రాలను, టీవీ కార్యాక్రమాలను నిర్మించింది. త్వరలో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బ్రూయిజ్డ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సిక్స్ ప్యాక్‌లో కనిపించనుంది.
https://ift.tt/2X04z0l
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/32zzFgo

0 Comments