స్టైలిష్ స్టార్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వలో తెరకెక్కుతున్న తాజా చిత్రం . గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. Also Read: ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ రెండు కుంటుబాల మధ్య సాగనుంది. ఓ ఉన్నత కుటుంబం, వారి దగ్గర డైవర్‌గా పని చేసే వ్యక్తి కుటుంబం సన్నిహింతంగా ఉంటుంటారు. వీరిద్దరికి ఒకేసారి మగపిల్లలు పుడతారు. అయితే కొన్ని కారణాల వల్ల డైవర్ కొడుకు పెద్దింట్లో, పెద్దింటి అబ్బాయి డ్రైవర్ ఇంట్లో పెరుగుతాడు. చివరికి అసలు నిజం బయటపడింది. అసలు ఒకరి ఇంట్లో ఒకరు పెరగటానికి కారణం ఏంటి అన్నదే అసలు కథ. Also Read: ఈ కథలో పెద్దింట్లో పుట్టి డ్రైవర్ ఇంట్లో పెరిగే కుర్రాడిగా అల్లు అర్జున్, డ్రైవర్ ఇంట్లో పుట్టి పెద్దింట్లో పెరిగే కుర్రాడిగా సుశాంత్ నటించనున్నారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. నవదీప్, నివేదా పేతురాజ్, టబు, మలయాళ నటుడు జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:
https://ift.tt/36VPvFH
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2Cyp373

0 Comments