rvnht

`సైరా` సురేందర్‌ రెడ్డి.. నెక్ట్స్‌ సినిమా నేషనల్‌ స్టార్‌తో..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన నరసింహా రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడి కథను వెండితెర మీద విజువల్‌ వండర్‌లా ఆవిష్కరించటంలో సక్సెస్‌ అయ్యాడు ఈ స్టైలిష్ మేకర్‌. దీంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి చిత్రం పైన పడింది. సైరా రిలీజ్‌ అయి చాలా రోజులు అవుతున్నా సురేందర్‌ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. సైరా కోసం రెండేళ్లకు పైగా పనిచేసిన సూరి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. తిరిగి వచ్చిన తరువాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నాడు సురేందర్‌ రెడ్డి. అయితే ఇప్పటికే సురేందర్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఇదే అంటూ రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. Also Read: రామ్‌ చరణ్‌తో సురేందర్‌ రెడ్డి సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. సూపర్‌ స్టార్ మహేష్ బాబుతోనే సూరి సినిమా ఉంటుందన్న టాక్‌ వినిపించింది. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ తెర మీదకు వచ్చింది. సురేందర్‌ రెడ్డి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ లో హీరోగా నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడన్న న్యూస్‌ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. Also Read: గతంలో ప్రభాస్‌ హీరోగా మున్నా, మిస్టర్‌ ఫర్ఫెక్ట్ సినిమాల్లో నటించాడు ప్రభాస్‌. తరువాత ఇద్దరి కాంబినేషన్‌ సెట్ చేసేందుకు ప్రయాత్నాలు జరిగినా ప్రభాస్‌ ఐదేళ్ల పాటు బాహుబలి సినిమాతో బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేసేందుకు దిల్ రాజు ఆసక్తిగా ఉన్నాడట. ప్రభాస్‌ కూడా దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌, రాధకృష్ణ (జిల్‌ ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కోసం రెడీ అవుతున్నాడు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను నిర్మించారు. ఈ నెలాఖరు నుంచి ఆ సెట్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. యూవీ క్రియేషన్స్‌తో కలిసి గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. Also Read:

https://ift.tt/34AstCk
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/34x4KTq

Post a Comment

0 Comments