కొంత మంది దర్శకులు వరుసగా ఒకే హీరోతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి దర్శకులు కనిపించకపోయినా తమిళ్‌లో అట్లీ వరుసగా విజయ్‌తో, శివ వరుసగా అజిత్‌లో సినిమాలు చేస్తుంటాడు. అలాగే మరికొందరు దర్శకుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. తెలుగులోనూ ఓ దర్శకుడు అలా ఒకే ఫ్యామిలీ హీరోలతో సూపర్ హిట్లు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు . వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ రీమేక్ సినిమా హరీష్‌కు మెగా డైరెక్టర్ మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ హీరోగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను తెరకెక్కించాడు హరీష్. ఎన్నో వివాదాలకు కారణమైన డీజే బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. Also Read: అంతుకుముందు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను తెరకెక్కించాడు హరీష్. ఈ సినిమాకు కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా గబ్బర్‌సింగ్‌కు దర్శకుడు కూడా హరీష్‌శంకరే. ఇలా వరుసగా మెగా హీరోలతో సూపర్ హిట్‌లు అందించిన హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని కూడా మెగా హీరోతోనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమా పూర్తయిన తరువాత హరీష్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. Also Read: ఇప్పటికే రామ్ చరణ్‌కు కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉందట. అయితే ఇంకా రామ్‌చరణ్, హరీష్ కథకు ఓకె చెప్పలేదని.. ఓకె చెప్పిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
https://ift.tt/2Qu4AXG
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2MzYXWv
0 Comments