rvnht

`కలర్‌ ఫోటో`తో హీరోగా మారుతున్న మరో కమెడియన్‌

ఇటీవల కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. గతంలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించినా తరువాత కామెడీ పాత్రల్లో కొనసాగారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలుగా మారుతున్న కామెడియన్లు హీరోలుగా కొనసాగలేక, తిరిగి కామెడీ పాత్రలు చేయలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అంతేకాదు ఒకసారి హీరోగా చేసిన వారికి తిరిగి కామెడీ పాత్రలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. తాజాగా మరో కమెడియన్‌ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా సినిమా ప్రారంభమైంది. కలర్‌ ఫోటో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నటుడు సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు షూటింగ్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. Also Read: సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ కమెడియన్‌ సునీల్‌ విలన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు సందీప్‌ రాజ్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

https://ift.tt/2Q3Itbx
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/2MxYUuz

Post a Comment

0 Comments