rvnht

మెగా మూవీకి బడ్జెట్‌ లిమిటేషన్స్.. చెర్రీ ప్లాన్‌ అదుర్స్‌!

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీలో దూసుకుపోతున్నాడు. దాదాపు పదేళ్ల విరామం తరువాత ఖైదీ నంబర్‌ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఆ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకున్నాడు. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిరు తన ఇమేజ్‌, క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ సినిమాను కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భారీ లాభాలు సాధించాడు. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలను వరుసగా చిరు తనయుడు రామ్ చరణ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. అదే బాటలో చిరు కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిని భారీగా తెరకెక్కించాడు రామ్‌చరణ్‌. రీ ఎంట్రీ సినిమా బడ్జెట్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించిన రామ్‌ చరణ్‌, సైరాకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాడు. అందుకే సైరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్‌ టాక్‌ వచ్చినా నష్టాలే మిగిలాయి. Also Read: సైరా ఎక్స్‌పీరియన్స్‌తో 152వ సినిమా విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు చెర్రీ. సైరాకు భారీ నష్టాలు రావటంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను లిమిటెడ్‌ బడ్జెట్‌లో తెరకెక్కించాలని నిర్ణయించారు. గురువారం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సందేశాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు స్లిమ్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. గతంలో చిరు, మణి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక బస్టర్‌ మ్యూజికల్ ఆల్బమ్స్‌ వచ్చాయి. ఈ సినిమాకు ఆ స్థాయిలోనే ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు రామ్‌ చరణ్‌. Also Read:

https://ift.tt/39Cjjs4
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu
https://ift.tt/39xA7k4

Post a Comment

0 Comments